కూలీలందరికీ పని కల్పించండి
హుస్నాబాద్‌రూరల్: జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా 2023–24 సంవత్సరానికి మండలంలో రూ.3.11 కోట్ల పనులు చేపట్టారు. దీనిపై సోమవారం మండల పరిషత్ ఆవరణలో ప్రజావేదిక నిర్వహించి పనుల ఆడిట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ బాలకిషన్ మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ పనులు చేయడంతో పాటు నీటి నిల్వకు ఫారంపాండ్‌లు తవ్వించడం వలన నీటి ఊటలను పెంచుతుందని అన్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులను ఆడిట్ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు కొన్ని లోపాలు వెలుగు చూసినట్లు చెప్పారు. ఒకరికి బదులు మరొకరు పనులు చేయడం, పశువుల పాకల విస్తీరణం లేకపోవడం లాంటి లోపాలను గుర్తించి నివేదించారు. అడిట్ బృందాలు ఇచ్చిన నివేదికలతో సిబ్బందితో చర్చించి రూ.50 వేల పనుల పై వివరణ కోరమన్నారు. తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ, ఏపీఓలకు సూచించారు. గ్రామాల్లోని కూలీలకు పనులు కల్పించే విధంగా ప్రణాళికలను రూపొందించి పనులు చేయించాలని చెప్పారు. కూలీలకు వెంటనే బిల్లులు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, గ్రామాల అభివృద్ధి పనులను గుర్తించి కూలీల చేత చేయించాలన్నారు. ఈ ప్రజావేదికలో ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీఓ రమేశ్, ఏపీఓ పద్మ, సీసీ పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.
అదనపు డీఆర్‌డీఓ బాలకిషన్
ఉపాధిహామీ పనులపై ప్రజావేదిక
Comments
Please login to add a commentAdd a comment