మా భూములు తీసుకోండి
ఇండస్ట్రియల్ పార్క్‌కు ఒప్పుకుంటున్నాం
● కలెక్టర్ మనుచౌదరిని కలిసిన రైతులు
● 55ఎకరాల భూముల పట్టాపాస్ పుస్తకాలు అందజేత
అక్కన్నపేట(హుస్నాబాద్): ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి పచ్చ జెండా పడినట్లే. అక్కన్నపేట మండలం చౌటపల్లి క్రాసింగ్ వద్ద ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి తాము ఒప్పుకుంటున్నామని, మా భూములు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ మనుచౌదరిని కలిశారు. ఈ సందర్భంగా సుమారు 55ఎకరాలకు సంబంధించిన పట్టాపాస్ పుస్తకాల జిరాక్స్ ప్రతులను కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇండస్ట్రీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు.
ఇంకా 28ఎకరాలే...
ఈ చౌటపల్లి క్రాసింగ్ వద్ద సర్వే నంబర్ 312లో దాదాపు 83ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఈ భూమిని గతంలో పేదలకు అసైన్డ్ చేసి పంపిణీ చేశారు. ఈ భూములన్నీ హుస్నాబాద్ నుంచి అక్కన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉంటాయి. మరికొద్ది రోజుల్లో ఈ ప్రధాన రహదారి నాలుగు లేన్లుగా మారనున్నది. ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భాగంగా సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్న రైతులే ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. దీంతో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇంకా సుమారు 28ఎకరాలే కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment