నాలుగు ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
సిద్దిపేటకమాన్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, పాలిక్లినిక్ సెంటర్లపై చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, పాలి క్లినిక్ సెంటర్‌లను వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని గురు సాయి కంటి ఆసుపత్రి, నిరామయ, బజరంగ్ పాలి క్లినిక్, మారుతి పాలి క్లినిక్‌లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆస్ప త్రుల సమాచారం, రిజిస్ట్రేషన్, వసతులు, ధరల పట్టక ప్రదర్శన, రెన్యువల్ వంటి ఇతర అన్ని రకాల వివరాలు హెచ్‌ఐఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయా లన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే వాటిపై చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రుల రికార్డులు, పేషెంట్ల కేషీట్ల పూర్తి వివరాలు అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రుల పేర్లు, డాక్టర్ పేరు మార్చినా జిల్లా వైద్యారోగ్యశాఖ డీఆర్‌ఏ ద్వారా అనుమతి పొందాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకళ, డాక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాల్సిందే
లేదంటే చర్యలు తప్పవు
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment