కొనుగోళ్లలో అక్రమాలు సహించం
గజ్వేల్: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు సహించబోమని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని సేకరించామన్నారు. రెండుమూడ్రోజుల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం గజ్వేల్ మార్కెట్ యార్డులో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు బాబుతో మాట్లాడారు. కేంద్రం నిర్వాహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ధాన్యం అమ్ముకోవడానికి కేంద్రానికి వచ్చిన ముట్రాజ్‌పల్లి రైతు రాయగిరి యాదగిరితో మాట్లాడారు. తేమశాతం చూసుకొని, జల్లి పట్టుకొని ధాన్యం తీసుకొచ్చానని చెప్పడంతో కమిషర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ రైతుకున్న అవగాహనను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ కూడా వేస్తున్నామని, ఇప్పటికే రూ.15కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.
ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దు
కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. దుద్దెడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అలాగే ధాన్యం తీసుకువచ్చిన రైతులతో అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
14లక్షల మెట్రిక్ టన్నులకుపైగా
ధాన్యం సేకరణ
రెండు, మూడ్రోజుల్లోనే
రైతులకు చెల్లింపులు
పౌరసరఫరాల శాఖ కమిషనర్
డీఎస్ చౌహాన్
గజ్వేల్‌లో కొనుగోలు కేంద్రం పరిశీలన
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
సిద్దిపేటరూరల్: కలెక్టరేట్‌లో కలెక్టర్ మనుచౌదరితో కలిసి డీఎస్ చౌహాన్ వరిధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు రూ.171 కోట్ల 56 లక్షల విలువైన 73,947 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ప్రచార వాహనం ప్రారంభం...
ప్రజా పాలన– ప్రజా విజయోత్సవాల సందర్భంగా రూపొందించిన ప్రజా పాలన కళాయాత్ర వాహనాలను మంగళవారం డీఎస్. చౌహన్ కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీఆర్ రవికుమార్, డీపీఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment