మార్కెట్ రేటుకు మూడింతల పరిహారం
కోహెడరూరల్(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఎలా పరిహారం చెల్లించమో అలాగే కెనాల్లో భూములు కోల్పోతున్న వారికీ మార్కెట్ విలువకు మూడింతల పరిహారం అందిస్తున్నట్లు ఆర్డీవో రామ్మూర్తి అన్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామంలో గౌరవెళ్లి ప్రాజెక్టు కెనాల్ కాలువ భూసేకరణ కోసం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరెళ్ల గ్రామ పరిధిలో 11ఎకారల 30గుంటల భూమి అవసరం ఉందన్నారు. భూసేకరణకు ప్రతి రైతు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భూసేకరణ డీటీ అరవింద్, ఆర్ఐ ఎల్లయ్య, ఇరిగేషన్ ఈఈ తదితరులు పాల్గొన్నారు.
ముంపునకు గురవుతున్న
రైతులతో ఆర్డీఓ రామ్మూర్తి
Comments
Please login to add a commentAdd a comment