సాక్షి, సిద్దిపేట: మత్స్యకారులకు చేయూతను అందించేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది పంపిణీ చేసేందుకు మత్స్య శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించారు. మొదటి సారి జూలై 23వ తేదీ వరకు టెండర్లు ఆహ్వానించగా ఎవరు ముందుకు రాలేదు. దీంతో గడువును ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ ఎవరు ముందుకు రాకపోవడంతో మళ్లీ ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. ఇద్దరు కాంట్రాక్టర్లు ముందుకురాగా వారికి చేప పిల్లల ఫాం లేకపోవడంతో వారు అనర్హులయ్యారు.
ఇతర జిల్లాల్లో పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్ లక్ష్మీనరసింహ ఫిష్ సీడ్ సప్లయర్స్‌కు జిల్లాకు సరఫరా చేసే బాధ్యతలు సైతం అప్పగించారు. సుమారు 6 లక్షల వరకు చేప పిల్లలను పంపిణీ చేసి.. సీడ్ లేదని సరఫరా చేయలేను అని చెప్పారు. దీంతో మరో కాంట్రాక్టర్ సూర్య అయ్యప్పకు అప్పగించారు. అతను ఇప్పటి వరకు 6.34లక్షల చేప పిల్లలు మాత్రమే సరఫరా చేశారు. రెండోసారి నియమించిన కాంట్రాక్టర్ పంపిణీ చేయడం లేదని ఇటీవల డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్‌కు జిల్లా మత్స్యశాఖ అధికారి లేఖను రాశారు. మరో కాంట్రాక్టర్‌ను నియమించాలని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment