మల్లన్న నిర్వాసితులకు ఆత్మీయభరోసా ఇవ్వాలి
సిద్దిపేటరూరల్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీబీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు నాలుగేళ్లుగా ఉపాధి హామీ పనులు కల్పించకుండా చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. దీంతో నిర్వాసితులు ఇందిరమ్మ ఆత్మీయభరోసాకు అర్హులు కాలేకపోతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎగొండస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు, హైకోర్టు న్యాయవాది దివాకర్ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
డీబీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
Comments
Please login to add a commentAdd a comment