అభివృద్ధికి సహకరించాలి
బెజ్జంకి(సిద్దిపేట): అభివృద్ధే ప్రధాన ఎజెండా అని, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ఆదిశగా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. బెజ్జంకి సహకార సంఘం ఆధ్వర్యంలో రూ. 3 కోట్లతో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్, ఏసీ ఫంక్షన్ హాల్‌ను మంగళవారం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, సహకార సంఘం చైర్మన్ తన్నీరు శరత్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొట్లాడుకునే జమాన పోయిందని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల్లో భేషజాలు లేకుండా, పార్టీల వైరం లేకుండా కలిసి పని చేస్తామన్నారు. తీసుకున్న రుణాలు సభ్యులు చెల్లించినప్పుడే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ఈ సంఘాలలోనూ రుణాలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పథకాలను తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణ గన్నేరువరంలో బ్రిడ్జి మంజూరు చేయాలని కోరారన్నారు. కార్యక్రమంలో సీఈఓ వాసు, వైస్ చైర్మన్ బండి రమేశ్, బ్లాక్ క్రాంగ్రెస్ అద్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, డైరెక్టర్‌లు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment