బ్యాంకుల్లో రక్షణ చర్యలు తప్పనిసరి
సిద్దిపేటకమాన్: బ్యాంకుల్లో తప్పకుండా సెక్యూరిటీ మెజర్స్, రక్షణ చర్యలు తీసుకోవాలని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో బ్యాంకుల అంతర్గత భద్రత, ఏటీఎంలో భద్రత, సీసీ కెమెరాల పనితీరుపై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, రీజినల్ మేనేజర్లతో కలిసి ఆమె మంగళవారం సమావేశం నిర్వహించారు. బ్యాంకులలో సీసీ కెమెరాలు 360 డిగ్రీలు కవర్ అయ్యేలా పెట్టుకుని రోజూ పర్యవేక్షించాలన్నారు. బ్యాంకుల్లో ఏ సంఘటన జరిగినా అలారం సిస్టమ్ పనిచేసేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని 160 బ్యాంకుల్లో పాయింట్స్ బుక్స్ ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకు మేనేజర్లు పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు తీసుకోవాలన్నారు. డబ్బులు తీసుకెళ్లేప్పుడు అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని సూచించారు. ప్రతీబ్యాంకు జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు మాట్లాడుతూ పోలీసు శాఖకు అందుబాటులో ఉండి సమాచారాన్ని త్వరగా ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌గౌడ్, కిరణ్, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సీపీ అనురాధ
Comments
Please login to add a commentAdd a comment