జిల్లాలో జరిగిన ఘటనలు.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో జరిగిన ఘటనలు..

Published Tue, Jan 21 2025 7:20 AM | Last Updated on Tue, Jan 21 2025 7:20 AM

జిల్ల

జిల్లాలో జరిగిన ఘటనలు..

పోలీస్‌ కమిషనరేట్‌ పరిఽధిలో సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా విద్యావంతులే వీటి బారిన పడుతున్నారు. వైద్యులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, బ్యాంక్‌ మేనేజర్లు పెద్ద సంఖ్యలో సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. రూ.లక్షల్లో తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి, ఇంటి నుంచే సంపాదన, లక్కీ డ్రా, బహుమతులు గెలిచారంటూ బోల్తా కొట్టిస్తున్నారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్ము అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

సాక్షి, సిద్దిపేట: గజ్వేల్‌కు చెందిన యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 18, నవంబర్‌ 2024న ఓ కాల్‌ వచ్చింది. మీకు కోరియర్‌ వచ్చింది.. మీ పేరిట వచ్చిన పార్శిల్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించామని బెదిరించారు. మీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయిందని, మరిన్ని వివరాలకు వీడియో కాల్‌లో నార్కొటెక్‌ డీసీపీ మాట్లాడతారని స్కైప్‌లో కాల్‌ కనెక్ట్‌ చేశారు. అవతల యూనిఫాంలో ఉన్న అధికారి మాటలు కలిపారు. సాయంత్రం వరకు అరెస్ట్‌ చేస్తామని లేదంటే చెప్పిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని దబాయించాడు. తన వద్ద డబ్బు లేదని సమాధానం ఇచ్చినా వారు కనకరించలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలు ఇస్తాయని, మీకు ఎంత అర్హత ఉందో... మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లోకి వెళ్లి చూడమని కేటుగాళ్లు సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే యాప్‌లోకి వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం.. 15 నిమిషాల్లో అతని ఖాతాలో నగదు జమకావడం జరిగిపోయింది. వెంటనే అతడు మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు రూ. 20లక్షలు బదిలీ చేశాడు. తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

పెరుగుతున్న మోసాల సంఖ్య

పోలీసులు ప్రజలల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్‌ మోసాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 2023లో 221 సైబర్‌ మోసాలు జరిగాయి. 2024లో జరిగిన 248 సైబర్‌ మోసాలలో 5,38,81,317 రూపాయలు బాధితులు పోగొట్టుకున్నారు. అందులో రూ.1,46,42,955 నగదును పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లాలో సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సిబ్బంది బాధితులకు న్యాయం కోసం కృషి చేస్తున్నారు.

టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930

ఆన్‌లైన్‌ మోసాలే కాకుండా సైబర్‌ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు గ్రామాల్లో, పాఠశాలు, కళాశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు. సైబర్‌ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.

గంటలోపే ఫిర్యాదు చేయాలి

సైబర్‌ క్రైంలో మోసపోయిన వారు గంటలోపే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. అలా చేయడం వలన రికవరీ చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రజల్లో అవగాహన అవసరం. అన్ని తెలిసిన వాళ్లే ఎక్కువగా మోసపోతున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌లు చేసి బెదిరిస్తే పోలీసులకు సమాచారం అందించండి.

–శ్రీనివాస్‌, ఏసీపీ, సైబర్‌ క్రైం

సిద్దిపేటకు చెందిన ఓ బ్యాంక్‌ మేనేజర్‌ రెగ్యులర్‌గా స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. టెలిగ్రామ్‌ ద్వారా ఓ ఐఐఎఫ్‌ఎల్‌ పేరుతో ఫేక్‌ యాప్‌ లింక్‌ వచ్చింది. లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశ చూపారు. దీంతో రూ.80.60లక్షలు ఆ యాప్‌లో పెట్టుబడి పెట్టారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసిన తర్వాత ఎలాంటి రిప్లే లేకపోవడంతో గమనించిన బ్యాంక్‌ మేనేజర్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించి బ్యాంక్‌ అకౌంట్‌లను ఫ్రీజ్‌ చేయించారు. సుమారు రూ.25లక్షల వరకు రీకవరీ చేశారు.

పెట్టిన పెట్టుబడికి డబుల్‌ ఇస్తామని ఓ ప్రభుత్వ వైద్యుడిని మోసం చేశారు. ఇన్‌స్ట్రాగామ్‌ పోస్ట్‌లలో లింక్‌ను పంపి ఆశ చూపారు. దానిలో ఆ ప్రభుత్వ ఉద్యోగి రూ.42లక్షలు పెట్టుబడి పెట్టారు. డబ్బులు తిరిగి రాలేదు.

ఆర్మీ సోల్జర్‌ పేరుతో రూ.4లక్షలకే కారు అమ్ముతున్నట్లు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టారు. కారు డెలివరీ తర్వాతనే డబ్బులు చెల్లించండి అని చెప్పారు. దీంతో ములుగుకు చెందిన ఓ విద్యార్థి కారు కొనుగోలు ముందుకు వచ్చాడు. మార్గం మధ్యలో ఆర్టీఏ పట్టుకున్నారంటూ రూ.1.08లక్షలు వసూలు చేశారు. మోసపోయిన గమనించిన సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లాలో జరిగిన ఘటనలు..1
1/1

జిల్లాలో జరిగిన ఘటనలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement