● కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండాలు ● తరిం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న కేత్రం పసుపువర్ణ శోభితమైంది. పట్నం వారం సందర్భంగా సోమవారం తోటబావి ప్రాంగణంలో పెద్దపట్నం, అగ్నిగుండాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ.. అగ్నిగుండంలో నడుస్తూ మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు. ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణంతో మారుమోగాయి. ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన మానుక పోచయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, దుర్గాప్రసాద్‌యాదవ్, యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండాలను నిర్వ హించారు. శివసత్తులు, భక్తులు బండారు (పసుపు)చల్లుకోవడంతో ఆలయ పరిసరాలు పసుపు మయమయ్యాయి.
21 వరుసలతో పెద్దపట్నం..
హైదరాబాద్ యాదవసంఘం ఒగ్గుపూజారులు పంచవర్ణాలతో 21వరుసలతో పెద్దపట్నం వేశా రు. అదే సమయంలో భగభగ మండే నిప్పు రవ్వలతో అగ్నిగుండం తయారు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌తోపాటు అర్చకులు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పెద్దపట్నంపైకి చేర్చి యాదవ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు(కల్యాణం) నిర్వహించారు. ఆలయ అర్చకులు అగ్నిగుండాలు దాటిన తర్వాత గ్యాలరీలలోని భక్తులు, శివసత్తులు అగ్నిగుండాలను దాటూతూ స్వామిని దర్శించుకున్నారు. ఆనవాయితీ ప్రకారం ఈఓ రామాంజనేయులు, ఆలయ సిబ్బంది యాదవ భక్తులకు, శివసత్తులకు కొత్త బట్టలు పెట్టి సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెద్దపట్నం మీదుగా
డమరుకంతో
స్వామిజీ విన్యాసం
Comments
Please login to add a commentAdd a comment