అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి ● పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
దుబ్బాకటౌన్: అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట 7, 9 వార్డులలో జరుగుతున్న రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. అనంతరం దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ఎంపిక చేసిన జాబితాను ఆన్లైన్ నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తనుజ, తహసీల్దార్ సంజీవ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఎంపీడీఓ భాస్కర శర్మ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment