గజ్వేల్‌రూరల్: డబుల్ బెడ్రూంల కోసం ఎంపిక చేసి రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఇళ్లను ఎందుకు కేటాయించడం లేదంటూ లబ్ధిదారులు సోమ వారం ఆందోళనకు దిగారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదల కోస ం రెండేళ్ల క్రితం మహతి ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి కొందరు గృహ ప్రవేశాలు చేయగా, మిగతా ఇళ్లలో మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన భూ బాధితులు ఉంటున్నారు. తమకు పూర్తి స్థాయిలో పరిహారం వచ్చే వరకు ఇక్కడి నుంచి ఖాళీ చేయబోమంటూ తాత్కాలికంగా కేటాయించిన ఇళ్లలో నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి రెండేళ్లు కావస్తున్నా గృహప్రవేశాలు చేయించకపోవడంతో ఇంటి అద్దెలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నామని లబ్ధిదారులు వాపోయారు. చేసేదిలేక పట్టణంలోని ఐవోసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వద్ద బైఠాయించామని తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ పురుషోత్తంరెడ్డి, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌లు ఐవోసీ వద్దకు చేరుకొని లబ్ధిదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఆందోళన కారులు శాంతించారు.
ఐవోసీ ఎదుట లబ్ధిదారుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment