ప్రసవాల సంఖ్య పెంచాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో
నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ పల్వన్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం గట్లమల్యాలలో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. రాజగోపాల్‌పేట పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖి చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాలు, హాజరు పట్టికను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం పల్వన్‌కుమార్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు రక్త నమూనాలను సేకరించి టీహబ్‌కు పంపించాలన్నారు. ఉద్యోగుల సమయపాలన పాటించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఎం రేవతి, డాక్టర్ సత్యనారాయణరావు, వైద్యాధికారులు ఉన్నారు.
డీఎంహెచ్‌ఓ పల్వన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment