అర్హులకే సంక్షేమ ఫలాలు
● ఇదొక నిరంతర ప్రక్రియ ● జాబితాలో పేర్లు రాకుంటేఆందోళన వద్దు ● మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు ● కలెక్టర్ మనుచౌదరి
హుస్నాబాద్ వార్డు సభల్లో రభస
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూసేందుకు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. కొండపాక మండలం దర్గా గ్రామంలో, కుకునూరుపల్లి మండలం తిప్పారంలో మంగళవారం నిర్వహించిన సభల్లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అమీద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి అధికారులు ఎంకై ్వరీ చేసిన జాబితాను గ్రామ సభ ముందుంచుతారన్నారు. పథకాలకు అర్హులైనప్పటికీ జాబితాలో పేర్లు రానివారు ఈ సభల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలనకు వస్తారన్నారు.
వేచరేణిలో...
చేర్యాల(సిద్దిపేట): అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్తరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం మండలంలోని వేచరేణిలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం నిరంతర ప్రక్రియ కాబట్టి సభలలో చదివే జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందకుండా మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేకాధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.
హుస్నాబాద్: పట్టణంలో 1వ వార్డు నుంచి 5వ వార్డుల్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై వార్డు సభలు నిర్వహించారు. 1వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ రసాభాసగా మారింది. సభ గంట ఆలస్యంగా ప్రారంభం కాగా కుర్చీలు వేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిలబడాలా అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇంటి స్థలం ఉండి, అద్దెకు ఉంటున్న వారి పేర్లను అర్హు ల జాబితాలో ఎందుకు చేర్చలేదని నిలదీ శారు. తప్పులతడకగా జాబితాను తయారు చేశారని మండిపడ్డారు. ఈ సర్వే ఫైనల్ కాదని, అర్హులైన వారుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయినా వినకపోవడంతో సభ గందరగోళంగా మారింది.
ఉద్రిక్తత
డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసేలా సభ తీర్మానం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు పట్టుపట్టారు. పదేళ్ల పాలనలో డబుల్ బెడ్రూంలు ఎందుకు పూర్తి చేయలేదని, దళితబంధు సైతం ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగారు. కొంతసేపు వాగ్వాదం జరిగింది.
బూర్గుపల్లిలో..
గజ్వేల్‌రూరల్: అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని, జాబితాలో పేర్లు లేనివారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బూర్గుపల్లిలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్సాన్‌పల్లిలో గొడవ
సిద్దిపేటఅర్బన్: పథకాల లబ్ధిదారుల ఎంపికపై సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి, బక్రిచెప్యాల, నాంచార్ పల్లి, వెల్కటూర్ గ్రామాల్లో మంగళవారం గ్రామసభలను అధికారులు నిర్వహించారు. బక్రిచెప్యాల గ్రామసభలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు. ఎన్సాన్‌పల్లి సభలో లబ్ధిదారుల జాబితాను ప్రకటించగా గందరగోళం నెలకొంది. అందు లో అనర్హులు ఉన్నారని మరోసారి పరిశీలించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తప్పకుండా దరఖాస్తులను స్వీకరిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
జాబితా పారదర్శకంగా జరగలేదని నిలదీసిన స్థానికులు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల వాగ్వాదం
ఒకరిపై మరొకరు ప్రత్యారోపణలు
Comments
Please login to add a commentAdd a comment