న్యూఢిల్లీ: స్లో బాల్స్ ఎలా వేయాలి. ఆఫ్ కటర్స్ ఎలా వేయాలి, యార్కర్లు ఎక్కడ సంధించాలి. లెంగ్త్ బాల్స్‌ను ఎప్పుడు వేయాలి.. పవర్ ప్లే బౌలింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్ అనేది జస్‌ప్రీత్ బుమ్రాకు కొట్టిన పిండి. ఏ సమయంలో బుమ్రా చేతికి బంతి ఇచ్చినా అద్భుతాలు చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం. టీమిండియా పేస్ బౌలింగ్ యూనిట్‌లో ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రాను ప్రపంచ దిగ్గజాలు ఇప్పటికే ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
వరల్డ్ క్రికెట్‌లో కంప్లీట్ ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రా.. 50 టెస్టు వికెట్లను వేగంగా సాధించిన తొలి టీమిండియా పేస్ బౌలర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు సరిపోయే భారత్ పేసర్‌గా బుమ్రాకు గుర్తింపు ఉంది. ఇవన్నీ బుమ్రా చాలా తక్కువ కాలంలో సాధించిన ఘనతలు. కాగా, బుమ్రా కంటే గొప్ప బౌలర్ భారత క్రికెట్ జట్టులో ఉన్నాడని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. బుమ్రా కంటే ఎందులోనూ తక్కువ కాదని అభిప్రాయపడ్డాడు.
క్రిక్‌బజ్‌తో మాట్లాడిన నెహ్రా.. గత మూడు-నాలుగేళ్ల నుంచి బౌలర్ల విషయానికొస్తే కేవలం బుమ్రా గురించే మాట్లాడతున్నారు. ఒకే ఇదేమీ తప్పుకాదు. కానీ స్కిల్స్ ప్రకారం చూస్తే బుమ్రా కంటే మహ్మద్ సిరాజ్‌తక్కువ కాదు. బుమ్రాకు ఎంతమాత్రం తీసిపోడు. నా దృష్టిలో స్కిల్స్‌లో బుమ్రా కంటే సిరాజే గొప్ప పేసర్ అనుకుంటున్నా. అన్ని ఫార్మాట్లను ప్రభావం చేసే బౌలర్ సిరాజ్. అతనికి ఆ సామర్థ్యం ఉంది.
సిరాజ్ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ గేమ్ పరిస్థితిని అర్థం చేసుకుంటే అతను సాధించలేదని ఏమీ ఉండదు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని మాత్రమే అతన్ని కోరుతున్నా. కొన్ని సంవత్సరాల క్రితం సిరాజ్‌కు గురించి మాట్లాడుకున్నాం. భారత్-ఎ జట్టుకు ఆడేటప్పుడు ప్రతీ మ్యాచ్‌లోనూ 5-6 వికెట్లు సాధించేవాడు. అప్పుడు అతనొక మంచి రెడ్‌బాల్ క్రికెట్ బౌలర్ అనే నమ్మేవాడ్ని. అలా ఆ రెడ్ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరాజ్.. వైట్‌బాల్ క్రికెట్‌లో దాన్ని కొనసాగిస్తున్నాడు’ అని తెలిపాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆర్సీబీ తరఫున సిరాజ్ ఆడుతున్నాడు.
ఇక్కడ చదవండి: ఫోన్ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్
రోహిత్.. సెహ్వాగ్‌ను ఓపెనింగ్ వద్దనగలమా?
Comments
Please login to add a commentAdd a comment