IPL 2022: అమ్మ‌కు వంద‌నం.. మదర్స్ డే సందర్భంగా సన్ రైజర్స్ స్పెషల్ వీడియో | IPL 2022: Sunrisers Hyderabad Players Share A Special Video Message On Mothers Day | Sakshi
Sakshi News home page

IPL 2022: అమ్మ‌కు వంద‌నం.. మదర్స్ డే సందర్భంగా సన్ రైజర్స్ స్పెషల్ వీడియో

Published Sun, May 8 2022 4:55 PM | Last Updated on Sun, May 8 2022 4:55 PM

IPL 2022: Sunrisers Hyderabad Players Share A Special Video Message On Mothers Day - Sakshi

photo courtesy: IPL

మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ప్ర‌త్యేక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు అమ్మల‌కు వంద‌నం తెలుపుతూ.. త‌మ‌త‌మ త‌ల్లుల‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ వీడియోలో కొంద‌రు స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్లు త‌మ త‌ల్లులు చేసిన త్యాగాల‌ను గుర్తు చేసుకుంటూ, వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, శశాంక్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు త‌మ త‌ల్లుల‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. పిల్లలంద‌రూ త‌మ‌త‌మ త‌ల్లుల‌ను ప్రేమించ‌డంతో పాటు ఆరాధించి, గౌర‌వించుకోవాల‌ని వారు పిలుపునిచ్చారు. త‌ల్లుల ఉనికిని తాము రోజు సెల‌బ్రేట్ చేసుకుంటామ‌ని, ఇవాళ ఆ సంబురాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయ‌ని క్యాప్ష‌న్ జోడించారు.


ఇదిలా ఉంటే, ఆరెంజ్ ఆర్మీ ఇవాళ (మే 8) రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో కీల‌క మ్యాచ్ ఆడుతుంది. ముంబైలోని వాంఖ‌డే మైదానంలో మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 14 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి ఆ జ‌ట్టు 2 వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డ‌క్‌గా వెనుదిర‌గ‌గా.. ర‌జ‌త్ ప‌టిదార్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 48 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. డుప్లెసిస్ (54), మ్యాక్స్‌వెల్ (11) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ కోల్పోయిన రెండు వికెట్లు సుజిత్ ఖాతాలోకి వెళ్లాయి. కాగా, స‌న్‌రైజ‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాల‌తో స్థానంలో నిలిచింది. 
చ‌ద‌వండి: IPL 2022: వారి స్థానంలో తుది జట్టులోకి ఆ ఇద్దరు: విలియమ్సన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement