ఎంఎస్ ధోని. (PC: Disney+Hotstar)
ఐపీఎల్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమి చవి చూసింది. బుధవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి గల కారణాలను సీఎస్‌కే కెప్టెన్ ఎంస్ ధోని వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. "మేము బెంగళూరుని 170 పరుగులకే పరిమితం చేశాం. బ్యాటింగ్‌లో కూడా మాకు అద్భుతమైన ఆరంభం వచ్చింది.
అయితే మధ్యలో మా బ్యాటర్లు నిరాశపరిచారు. ఛేజింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్ పరంగా ఎలా ఆడాలో తెలుస్తుంది. పరిస్ధితుల బట్టి కొన్ని సమయాల్లో మన బ్యాటింగ్ ప్రవృత్తిని మార్చుకోవాలి. అటువంటి సమయాల్లో షాట్‌లను ఆడడం కంటే.. పరిస్థితి ఏమి డిమాండ్ చేస్తుందో ఆ విధంగా ఆడాలి. పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తున్న క్రమంలో.. మేము వరుసగా వికెట్లను కోల్పోయాము. అదే ఓ ఓటమికి ప్రధాన కారణమని" ధోని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 7 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment