వన్డే ప్రపంపచకప్-2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శనివారం అహ్మదాబాద్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లకు హిట్‌మ్యాన్ చుక్కలు చూపించాడు.
ముఖ్యంగా పాక్ స్టార్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, హ్యారీస్ రవూఫ్‌ను ఓ ఆట ఆడేసుకున్నాడు. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంపచకప్-2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
శనివారం అహ్మదాబాద్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లకు హిట్‌మ్యాన్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా పాక్ స్టార్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, హ్యారీస్ రవూఫ్‌ను ఓ ఆట ఆడేసుకున్నాడు. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
కండలు చూపించిన రోహిత్ శర్మ..
కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 15 ఓవర్‌లో పాక్ స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్ వేసిన తొలి బంతిని రోహిత్ శర్మ భారీ సిక్సర్‌గా మలిచాడు. 141.1 కి.మీ వేగంతో వేసిన బంతిని హిట్‌మ్యాన్ తన ట్రేడ్‌మార్క్ ఫుల్ షాట్ ఆడాడు. ఇది చూసిన అందరూ ఆశ్యర్యపోయారు. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ సైతం షాక్‌కు గురయ్యాడు.
ఈ క్రమంలో రోహిత్ దగ్గర వెళ్లిన ఎరాస్మస్.. ఎటువంటి భారీ షాట్లు ఎలా ఆడుతున్నారని ప్రశ్నించాడు. అందుకు బదులుగా రోహిత్ నవ్వుతూ తన కండలు చూపించాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్‌తో మాట్లాడిన రోహిత్.. "ఇదే విషయంపై స్పందించాడు. అంత ఈజీగా సిక్సర్లు కొడుతున్నావని అంపైర్ నన్ను అడిగాడు. అది బ్యాట్ పవరా అని అన్నాడు. అందుకు బదులుగా కాదు అది నా పవర్ అని చెప్పా" అని రోహిత్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: బాబర్ ఆజం అలా చేయడం సరి కాదు.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సింది: పాక్ లెజెండ్
— Rohit Sharma Trends™ (@TrendsRohit) October 15, 2023
Comments
Please login to add a commentAdd a comment