విజయసాయిరెడ్డి సమక్షంలోపార్టీలో చేరిన చేజర్ల సుబ్బారెడ్డి
టీడీపీలో ఉక్కపోత
వైఎస్సార్సీపీలోకి తిరిగొచ్చేస్తామంటున్న నేతలు
తాజాగా చేజర్ల సుబ్బారెడ్డి చేరిక
ఉదయగిరి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ పెయిడ్ గ్యాంగ్‌తో చేయించిన మౌత్ టాక్ బెడిసికొడుతోంది. తెలిసో.. తెలియకో.. ఇతర కారణాలతో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు అక్కడ ఇమడలేక ఒక్కొక్కరూ సొంత గూటికి క్యూ కడుతున్నారు. ఊహించని పరిణామాలతో టీడీపీ నేతలు దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రానుందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు బూటకపు ప్రసంగాలు చేయడంతో పాటు ఇదే అంశమై ఎల్లో మీడియా.. పెయిడ్ గ్యాంగ్‌లతో ప్రచారాలకు యత్నించారు. ఈ విష వలయంలో చిక్కి కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకొన్నారు. అయితే వారికి అక్కడ సముచిత స్థానం.. కనీస మర్యాదా లభించలేదు. దీంతో సొంత పార్టీని వీడి తప్పు చేశామని వారు మదనపడుతున్నారు.
బస్సుయాత్రకు బ్రహ్మరథం
ఇడుపులపాయ నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్రతో క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పట్టు అర్థమైంది. యాత్రలో జగనన్నకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో టీడీపీ ఆడిన మైండ్‌గేమ్‌లో పడి, తాము చేసిన తప్పును తెలుసుకున్న చాలా మంది తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. దీనికి చక్కటి ఉదాహరణగా నెల్లూరు జిల్లాను తీసుకోవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో వేమిరెడ్డి ఉన్న సమయంలో జిల్లాలో చాలా మంది నేతలు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో వేమిరెడ్డి పార్టీ మారిన సమయంలో ఆయనపై అభిమానం.. ప్రేమతో కొంతమంది వైఎస్సార్సీపీకి దూరమయ్యా రు. అయితే అక్కడికి వెళ్లాక అవమానాలకు గురవుతున్నారు.
వీపీఆర్‌ను నమ్ముకొని తాము పార్టీ మారామని.. అయితే టీడీపీలో ఆయనకే తగిన గౌరవం లేదని.. తమ సంగతి దేవుడెరుగని మదపడుతున్నారు. ఈ పరిణామాలతో వైఎస్సార్సీపీ.. తమ అభిమాన నేత జగనన్నపై ప్రేమ చంపుకోలేక అనేక మంది సొంత గూటికి చేరుకుంటున్నారు. తాజాగా ఉదయగిరి నియోజకవర్గ ముఖ్యనేత, మాజీ ఎంపీీపీ చేజర్ల సుబ్బారెడ్డి తన ముఖ్య అనుచరులతో కలిసి పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లాలో ఇప్పటికే బలమైన నేతలు, కేడర్ లేక సతమతమవుతున్న టీడీపీ ఈ పరిణామాలతో మరింత బలహీనమవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment