నెల్లూరు (టౌన్): మార్కులు, ర్యాంకులు పేరిట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రాథమిక దశ నుంచే ఇంటర్ పుస్తకాలను విక్రయించి వారిపై ఆ సిలబస్‌ను బలవంతంగా రుద్దుతున్నారు. పిల్లల ఆసక్తితో సంబంధం లేకుండా మార్కులు, ర్యాంకులే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. రోజూ 12 నుంచి 13 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టేలా చేస్తూ వారిని బాహ్య ప్రపంచానికి దూరం చేస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక.. ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో కొందరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరికొందరు తక్కువ మార్కులొచ్చాయనే ఆందోళనతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అయితే ఇవేవీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు పట్టడంలేదు.
హాస్టళ్ల నిర్వహణ.. అంతా అయోమయం
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 50కుపైగా హాస్టళ్లున్నాయి. వీటిలో ఎన్నింటికి అనుమతులున్నాయో స్పష్టత లేదు. వీటి నిర్వహణకు అనుమతిని ఎవరు జారీ చేస్తున్నారనే అంశంలోనూ అయోమయమే. మరోవైపు వీటికి అనుమతులు, నిర్వహణలో తమకెలాంటి సంబంధంలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పాఠశాలల ప్రాంగణంలో హాస్టళ్లను నిర్వహించకూడదు. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. నాసిరక భోజనాన్ని అందిస్తున్నారు. పోనీ సరైన వసతులున్నాయానంటే అదీ మృగ్యమే. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో ఆరేడుగురు విద్యార్థులను ఉంచుతున్నారని తెలుస్తోంది. భోజన నాణ్యతపై తనిఖీలు చేసే నాథుడే కరువయ్యారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి పాఠశాలలకు సంబంధించిన హాస్టళ్లపై తనిఖీలు నిర్వహించి.. నిబంధనలను అతిక్రమించిన యాజమాన్యాలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పిల్లల ఇష్టాలను పట్టించుకోని
తల్లిదండ్రులు
అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్న విద్యాసంస్థల యాజమాన్యాలు
ఏటా తెరపైకి కొత్త కోర్సులు
ఐఐటీ, నీట్‌కు బోధన అంటూ బుకాయింపు
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల
బలవన్మరణాలు
అనుమతుల్లేకుండానే హాస్టళ్ల నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment