స్క్రీనింగ్‌తో కేన్సర్‌ను దూరం చేయొచ్చు
నెల్లూరు(అర్బన్): ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతో కేన్సర్‌ను దూరం చేయొచ్చని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య పేర్కొన్నారు. జాతీయ కేన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సింగ్ విద్యార్థినులు, డాక్టర్లతో కలిసి భారీ ర్యాలీని జిల్లా వైద్యశాఖ, పీహెచ్‌పీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద ర్యాలీని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ సుధీర్‌కుమార్, డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడారు. 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారైనా అల్ట్రాసౌండ్ స్కానింగ్, రక్త పరీక్షను చేయించుకోవాలని కోరారు. కేన్సర్ నివారణలో భాగంగా ఇంటి వద్దే స్క్రీనింగ్ పరీక్షలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, డీపీఎంఓ రమేష్, డెమో అధికారి కనకరత్నం, వైద్యాధికారులు ప్రమోద్, నవీన్, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment