నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డిప్లొమా కోర్సులకు సీట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రిన్సిపల్ వీరవెంకట నాగరాజమన్నార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలని, బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పా రు. ఆ తర్వాత ఎంపీసీ విద్యార్థులకు, అప్పటికీ సీట్లు మిగిలితే ఇతర గ్రూపుల వారిని పరిశీలించనున్నామని తెలిపారు. డిప్లొమా ల్యాబ్, అనస్థీషియన్, ఆప్తాల్మిక్, ఆప్తోమెట్రీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్లు తదితరాలకు సంబంధించి 95 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నామని, దరఖాస్తులను మెడికల్ కళాశాలలో డిసెంబర్ రెండులోపు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు అందజేయాలని కోరారు. దరఖాస్తు రుసుముగా రూ.100ను చెల్లించాలని చెప్పారు. రిజిస్టర్ పోస్ట్ లేదా acsrgmcnlr @gmail. com కు సైతం పంపవచ్చని వివరించారు. పూర్తి వివరాలకు spsnellore. ap. gov. in/notice/recruitmentను పరిశీలించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment