పశుగణనకు పాడి రైతులు సహకరించాలి
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో నిర్వహిస్తున్న పశుగణనకు పాడి రైతులు సహకరించాలని పశుగణన నోడల్ అధికారి డాక్టర్ మంజునాథ్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 15 శాతం మేరే ప్రక్రియ జరిగిందని చెప్పారు. సమయానికి మూగజీవాల్లేకుండా పోవడం.. మేతకెళ్లడం.. పాడి రైతులు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమవుతోందని వివరించారు. గ్రామాలకు పశుసంవర్థక శాఖ అదికారులు, సిబ్బంది వచ్చిన సమయాల్లో సహకరించాలని కోరారు.
గంజాయి
తరలిస్తుండగా అరెస్ట్
● ఎనిమిది కిలోలు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరు తరలిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. తనిఖీల వివరాలను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు – 2 ఇన్‌స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి తన కార్యాలయంలో వెల్లడించారు. జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో వాహన తనిఖీలను తెల్లవారుజామున నిర్వహించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, లంబసింగి కట్టిముల్లకు చెందిన లోవరాజు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గల బ్యాగ్‌ను తనిఖీ చే యగా, ఎనిమిది కిలోల గంజాయిని గుర్తించి స్వాఽ దీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడ్ని స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. గంజాయి మత్తుకు బానిసైన లోవరాజు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో లంబసింగిలో కొనుగోలు చేసి బెంగళూరులో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడైంది. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment