జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్
నెల్లూరు(క్రైమ్): అక్రమ రవాణా.. అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను పోలీసులు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 19 మందిపై.. నిబంధనలను ఉల్లంఘించి డ్రైవింగ్ చేస్తున్న వారిపై 227 కేసులు నమోదు చేసి రూ.1,16,635 జరిమానాను విధించారు. పలు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 29 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్‌ను శనివారం రాత్రి 11 గంటల నుంచి రెండు గంటల పాటు చేపట్టామని వివరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment