● భర్త చనిపోయి పుట్టింట్లో ఉంటున్న తనను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మేనమామ తీవ్రంగా కొడుతున్నాడని విచారించి న్యాయం చేయాలని కోవూరుకు చెందిన మహిళ వినతిపత్రం ఇచ్చారు.
● ప్రముఖ బ్యాంకులో పీఓ ఉద్యోగం ఇప్పిస్తానని వేదాయపాళేనికి చెందిన బెనర్జీ రూ.25 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకుండా, నగదు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● కోర్టులో ఉన్న కేసును రాజీ చేసుకోవాలని బెంగళూరుకు చెందిన రూప్‌కుమార్ అతని అనుచరులు బెదిరిస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని తోటపల్లిగూడూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● తన రెండో కుమారుడి మరణం అనుమానాస్పదంగా ఉందని లోతుగా దర్యాప్తు చేసి నిజాలు వెలికితీసి నిందితులపై చర్యలు తీసుకోవాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ వినతిపత్రం అందజేశారు.
● తన బావ ఇస్మాయిల్ ఫోన్‌లో బెదిరిస్తూ వేధిస్తున్నాడని, కుటుంబంలో వివాదాలు ఏర్పడ్డాయని అతడిపై చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment