నెల్లూరు(క్రైమ్): ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నెల్లూరు రూరల్ మండలం వెంగళరావ్నగర్లో ఏసుపాదం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఏసుపాదం ఇంటికి వచ్చి పని ఉందని తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అతడి జాడ తెలియరాలేదు. బాధిత కుటుంబసభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment