సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఆగని కేసులు
హిందూపురం: సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు ఆగడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫలితాల తర్వాత మాట్లాడుకుందామంటూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేసే వారిని అణచివేసే క్రమంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ నిమిత్తం పోలీసులు శనివారం హిందూపురంలోని దండు రోడ్డులోని ఇంటికి వెళ్లి లోకేష్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మహేష్, నాగరాజు, నాగమణి శనివారం రాత్రి స్టేషన్‌కు తరలివచ్చి లోకేష్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా ఏనాడూ ఎవరిపైనా కక్షసాధింపులకు దిగలేదని గుర్తు చేశారు. కూటమి పాలనలో భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు, విచారణ పేరుతో వేధిస్తే సహించేది లేదన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, నాయకులు వేణురెడ్డి ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో న్యాయవాది వెంకటరెడ్డి పూచికత్తుపై లోకేష్‌ను పోలీసులు వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment