14న జాతీయ మెగా లోక్ అదాలత్
హిందూపురం: స్థానిక ఏడీజే కోర్టు ఆవరణలో డిసెంబర్ 14న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కంపల్లె శైలజ తెలిపారు. శనివారం ఏడీజే కోర్టు ఆవరణలో లోక్ అదాలత్‌పై సీనియర్ సివిల్ జడ్జి మానిపాటి శ్రీధర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఏడీజే మాట్లాడుతూ సాధ్యమైన మేరకు ఎక్కువ కేసులు పరిష్కరించే దిశగా పోలీసులు, న్యాయవాదులు సహకరించాలన్నారు. న్యాయవాదులు రాజీమార్గం ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి లోక్ అదాలత్‌కు సిఫార్సు చేయాలని కోరారు. కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సుకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వన్నూరప్ప, న్యాయవాదులు సుదర్శన్, సవేరా, భాగ్య, సీఐ జనార్దన్‌తోపాటు హిందూపురం డివిజన్, పరిగి ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment