ప్రభుత్వ స్థలంపై కూటమి నేతల కన్ను
బత్తలపల్లి: సంజీవపురంలో ప్రభుత్వ భూమిపై కూటమి పార్టీల నేతల కన్ను పడింది. సచివాలయం వద్ద రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వ ఆధీనంలో కొంత భూమి ఉంది. ఇది లక్షల రూపాయలు విలువ చేస్తుంది. ఇక్కడ స్థలాన్ని ఆక్రమించుకున్న కూటమి పార్టీ నేత ఇంటి నిర్మాణం కోసం చదును చేసి.. మార్కింగ్ వేశాడు. అంతటితో ఆగకుండా ఈ ప్రాంతంలో ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. తాను ఆక్రమించిన స్థలాన్ని కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి గ్రామంలో ఇళ్లు లేని పేదలు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మరొక చోట కూడా అనువైన భూమి ఉంది. అయితే అక్కడ కాదని రోడ్డు పక్కన మంచి ధర పలికే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడంపై గ్రామస్తులు అవాక్కయ్యారు. ఈ విషయమై తహసీల్దార్ స్వర్ణలతను వివరణ కోరగా తామెవరికీ స్థలాలు, పట్టాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సచివాలయానికి కావలసిన స్థలం వదిలేసి మిగిలిన స్థలంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టాలు ఇస్తామంటూ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment