అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచండి
చెన్నేకొత్తపల్లి: అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశించారు. చెన్నేకొత్తపల్లి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిఽధిలోని రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల ఎకై ్సజ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రా మద్యం రాకుండా సిబ్బంది నిఘా పెంచాలన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు ఏర్పాటు కాకుండా చూడాలని ఆదేశించారు. ఎంఆర్పీకే మద్యం విక్రయాలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని సీఐ ఫరూఖాజంకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment