మామిడి పూతను నిలుపుకోండి
● ఉద్యానశాఖ డీడీ జి.చంద్రశేఖర్
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు పూత దశకు చేరుకున్నందున మంచి దిగుబడులు సాధించేలా పూతను కాపాడుకోవాలని రైతులకు శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖ డీడీ జి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కీలక సమయంలో మేలైన యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
● తోటల్లో 10 శాతం చెట్లు కూడా పూత పట్టకుంటే ఒక నీటి తడి ఇచ్చి 10 గ్రాముల 13–0–45 + 2 గ్రాముల సూక్ష్మధాతు మిశ్రమాన్ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.
● 25 శాతం మేర పూత వచ్చివుంటే ఒక నీటి తడి ఇచ్చి 1 మి.లీ బ్రాసినోలిడ్ + 0.5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ + 2 మి.లీ హెక్సాకొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. .
● 50 శాతానికి పైబడి పూత వచ్చివున్న తోటల్లో 0.3 మి.లీ ప్లానోఫిక్ + 0.3 గ్రాముల థయోమిథాక్సామ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.
● 75 నుంచి 100 శాతం మేర పూత వచ్చివున్న తోటలు, అలాగే 10 శాతం పిందె పట్టిన తోటల్లో 0.3 మి.లీ స్పైనోసాడ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు.
● ఇక మామిడిని బాగా దెబ్బతీస్తున్న పండుఈగ నివారణకు ఇప్పటి నుంచి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పండు ఈగను ఆకర్షించే బుట్టలు లేదా మీథైల్ యూజినాల్ టాబ్లెట్స్ లేదా జెల్ ఎకరాకు 5 బుట్టలు కడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
12న రెడ్డి వివాహ పరిచయ వేదిక
రాప్తాడు రూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రెడ్డి జన సంఘం వ్యవస్థాపకులు రొద్దం సురేష్‌రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం రూరల్ పరిధిలోని పాపంపేట బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వెనుక ఉన్న సంఘం కార్యాలయంలో రెడ్డి వివాహ పరిచయ వేదికను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వారు పిల్లల బయోడేటాతో హాజరు కావాలి. పూర్తి వివరాలకు చంద్రమౌళీరెడ్డి, దుబ్బర కిషోర్‌రెడ్డి (93902 84296), తోపుదుర్తి రామకృష్ణారెడ్డి (94907 67224), మంత్రి విశ్వనాథ్‌రెడ్డి (99891 38044)ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment