ఇద్దరు బిడ్డలతో సహా.. మహిళ ఆత్మహత్యాయత్నం
పుట్టపర్తి అర్బన్: కుటుంబ సమస్యలకు తోడు ముక్కోటి ఏకాదశి రోజున భర్త తనను కొట్టాడని అవమాన భారంతో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుట్టపర్తి పట్టణంలోని కుమ్మరి పేటకు చెందిన బాలరాజు, నాగవేణి దంపతులు తరచూ గొడవ పడేవారు. వారికి ఆరేళ్ల పాప, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. బాలరాజు.. నాగవేణిపై చేయి చేసుకున్నాడు. పండుగ రోజు వీధిలో ఉన్న వాళ్లందరి ముందర తనను కొట్టాడన్న ఆవేశంలో నాగవేణి తన కుమార్తె, కుమారుడిని ఎత్తుకొని చిత్రావతి నదిలో ఉన్న చెక్ డ్యాంలో దూకింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆమెనూ, ఇద్దరు బిడ్డలనూ బయటకు తీసి వెంటనే సత్యసాయి జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ కుమార్తెకు ప్రాథమిక చికిత్స అందించి ఎలాంటి ప్రమాదం లేదని ఇంటికి పంపారు. అయితే మూడేళ్ల కుమారుడు నదిలో ఎక్కువ నీళ్లు తాగడంతో పరిస్థితి విషమంగా ఉందని వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment