క్రీడా సమ్మేళనానికి ‘హిల్‌వ్యూ’ ముస్తాబు
పుట్టపర్తి రూరల్: సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనానికి హిల్‌వ్యూ స్టేడియం సిద్ధమైంది. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
‘హిల్‌వ్యూ’లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్..
బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో 1995లో సత్యసాయి యూనిటీ కప్ పేరిట ఇండియా 11, వరల్డ్ 11 మధ్య ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఈ మైదానంలోనే నిర్వహించడం గమనార్హం. ఒక రకంగా చెప్పాలంటే.. ఏటా జనవరి 11న జరిగే సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనం ఈ ప్రాంత వాసులకే కాక ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సాయి భక్తులకు ప్రత్యేకం. విలువలతో కూడిన విద్యతో పాటు విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని నింపేందుకు సాంస్కృతిక క్రీడా సమ్మేళనం నాలుగు దశాబ్ధాల క్రితం ప్రారంభించారు. శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని పుట్టపర్తి, బెంగళూరు బృందావనం, ముద్దెనహళ్లి, అనంతపురం క్యాంపస్ విద్యార్థులు, ఈశ్వరమ్మ, ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాల విద్యార్థులు, వైట్‌ఫీల్డ్ స్విమ్స్ నర్సింగ్ విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొంటారు. అద్భుత సాహసోపేత విన్యాసాలు ప్రదర్శించేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరుతున్నారు.
స్పోర్ట్స్ మీట్ ఇలా..
శనివారం ఉదయం 8 గంటలకు బ్రాస్‌బాండ్‌తో కూడిన మార్చ్ ఫాస్ట్‌తో మొదలవుతుంది. 9 గంటలకు క్రీడా జ్యోతి వెలిగించి పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 10.30 గంటల వరకూ సాంస్కృతిక క్రీడా విన్యాసాలు ఉంటాయి. సాయంత్రం 4.15 నుంచి 7 గంటల వరకూ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు.
నేటి ఉదయం 8 గంటల నుంచి
కార్యక్రమాలు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
Comments
Please login to add a commentAdd a comment