సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో పలువురిని నియమించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బైకా విజయభాస్కర్‌రెడ్డి (కదిరి), వీఎస్ పురుషోత్తంరెడ్డి (హిందూపురం), శివప్రసాద్ (మడకశిర), కోనపల్లి రఘురామిరెడ్డి (పెనుకొండ), సానె రాజశేఖర్‌రెడ్డి (రాప్తాడు), బుక్కపట్నం కేశవ (పుట్టపర్తి), ఎం.సాయికుమార్ (ధర్మవరం), జనరల్ సెక్రెటరీలుగా కేవీ ప్రణీత్‌రెడ్డి (కదిరి), ఏఎస్ దిలీప్‌కుమార్ (హిందూపురం), భీమిరెడ్డి నాగేశ్వర్‌రెడ్డి (రాప్తాడు), పోలె వెంకటరెడ్డి (పుట్టపర్తి), కోటి సురేశ్ కుమార్ (ధర్మవరం), ట్రెజరర్‌గా పి.రామక్రిష్ణారెడ్డి (పెనుకొండ), ఆర్గనైజేషనల్ సెక్రెటరీలుగా ఎన్‌టీ తిప్పేరుద్ర (హిందూపురం), ఎం.గిరీశ్‌బాబు (హిందూపురం), కదిరి రామకృష్ణారెడ్డి (రాప్తాడు), నీరుకంటి నారాయణరెడ్డి (రాప్తాడు), ఇ.జయకుమార్ (మడకశిర), డీఈ నటరాజు (మడకశిర), ఎం.భాస్కర్ (ధర్మవరం), బి.ప్రభాకర్‌రెడ్డి (ధర్మవరం), ఎం.రఘురామయ్య (పుట్టపర్తి), ఎన్.హనుమంతరెడ్డి (పుట్టపర్తి), హరిజన వెట్టి కంబాలప్ప (పెనుకొండ), బోరెడ్డిపల్లి కురుబ నరసింహమూర్తి (పెనుకొండ), ఆంజనేయరెడ్డి (కదిరి), ఎస్.ఈశ్వరయ్య (కదిరి) నియమించారు. అలాగే యాక్టివీటీ సెక్రెటరీలుగా డి.శ్రీనివాస్‌రెడ్డి (హిందూపురం), డి.గిరిధర్‌బాబు (హిందూపురం), కురుబ వెంకటరాముడు (రాప్తాడు), మంత్రి నాగరాజు (రాప్తాడు), మద్దన్న (మడకశిర), లోకేశ్ (మడకశిర), కె.రమాదేవి (ధర్మవరం), జొల్లిరెడ్డి అశ్వర్థు (ధర్మవరం), వై.మధుసూదన్‌నాయుడు (పుట్టపర్తి), ఎం.మహబూబ్‌సాబ్ (పుట్టపర్తి), తురకలాపట్నం గుట్టి నరేంద్రరెడ్డి (పెనుకొండ), ఎస్.ఆంజనేయులు నాయక్ (పెనుకొండ), బి.చిన్నక్రిష్నారెడ్డి (కదిరి), నాగరాజు (కదిరి), అధికార ప్రతినిధులుగా ఆర్.శివశంకర్‌రెడ్డి (హిందూపురం), కర్రా హనుమంతరెడ్డి (రాప్తాడు), ఆనంద రంగారెడ్డి (మడకశిర), గుర్రం శ్రీనివాసరెడ్డి (ధర్మవరం), సి.ఓబులేసు (పుట్టపర్తి), మేడార శంకరప్ప (పెనుకొండ), వి.మహబూబ్‌బాషా (కదిరి) నియమితులయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ జాబితా శుక్రవారం సాయంత్రం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేశారు. మండలాలకు కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్టూడియో శ్రీనివాస్ (అగళి), జి.త్రిలోక్‌నాథ్ (అమరాపురం), నరసింహారెడ్డి (రొళ్ల), డీఎల్ యంజారేగౌడ్ (గుడిబండ), రామిరెడ్డి (మడకశిర), పుట్టా కమ్మప్ప (మడకశిర నగర పంచాయతీ) నియమించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సి.రామాంజినప్ప (హిందూపురం రూరల్), టి.మన్సూర్ ఖాన్ (హిందూపురం క్లస్టర్ 1), సి.నాగరాజు (హిందూపురం క్లస్టర్ 2), ఎస్.నిస్సార్ (లేపాక్షి), ఎస్.రామకృష్ణారెడ్డి (చిలమత్తూరు), పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించి బి.నరసింహులు (పెనుకొండ నగర పంచాయతీ), ఎస్.వీరాంజనేయరెడ్డి (గోరంట్ల), బీకే నరసింహమూర్తి (పరిగి), పి.సుధాకర్‌రెడ్డి (పెనుకొండ), బోయ తిమ్మయ్య (రొద్దం), గజేంద్ర (సోమందేపల్లి)లను నియమించారు. అలాగే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి జొన్నగిరి బాలపోతన్న (ఆత్మకూరు), సాకే వెంకటేశ్ (రాప్తాడు), కుంపటి నాగమునెప్ప (కనగానపల్లి), మీనుగ నాగరాజు (రామగిరి), డోలా రామచంద్రారెడ్డి (సీకే పల్లి), బండి పవన్‌కుమార్ (అనంతపురం రూరల్ 1), దుగ్గుమర్రి గోవిందరెడ్డి (అనంతపురం రూరల్ 2), ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఎం.జయరామిరెడ్డి (బత్తలపల్లి), ఎన్.రామయ్య (ధర్మవరం రూరల్), సీవీ నారాయణరెడ్డి (ముదిగుబ్బ), ఎ.రామాంజినేయులు (తాడిమర్రి) మండల కమిటీ అధ్యక్షులుగా నియమితులయ్యారు.
వైఎస్సార్‌సీపీ మండల కమిటీల ఎన్నిక..
Comments
Please login to add a commentAdd a comment