వీరభద్రుని సేవలో కేంద్ర మంత్రి | - | Sakshi
Sakshi News home page

వీరభద్రుని సేవలో కేంద్ర మంత్రి

Published Sat, Jan 11 2025 12:34 AM | Last Updated on Sat, Jan 11 2025 12:34 AM

వీరభద

వీరభద్రుని సేవలో కేంద్ర మంత్రి

లేపాక్షి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి దంపతులు శుక్రవారం సందర్శించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి సమక్షంలో ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలతో పాటు నాట్యమంటపం, కల్యాణ మంటపం, నాగేంద్రుని విగ్రహం, సీతమ్మ పాదం తదితర వాటిని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను అర్చకుల ద్వారా తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత పంకజ్‌చౌదరి దంపతులను దేవదాయశాఖ అధికారులు సత్కరించారు. పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మి, రూరల్‌ సీఐ జనార్దన్‌, ఎస్‌ఐ నరేంద్ర, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నిలకడగా ఎండు మిర్చి ధరలు

హిందూపురం అర్బన్‌: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ఎండు మిర్చి ధరలు నిలకడగా సాగాయి. మార్కెట్‌లో ఈ నామ్‌లో వేలం పాటలు జరగ్గా మొదటి రకం ఎండు మిర్చి క్వింటా రూ.16,500, రెండోరకం రూ.9,000, మూడో రకం రూ.7,000 పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు.

పురాతన ఆలయంలో

విగ్రహాల ధ్వంసం

అగళి: పురాతన ఆలయంలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు ఈ దురాగతానికి పాల్పడినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. వివరాలు... అగళి మండలం హెచ్‌డీ హళ్లి గ్రామ శివారున అత్యంత పురాతనమైన భైరప్ప స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో గుప్త నిధులు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో కొందరు వ్యక్తులు పథకం ప్రకారం గురువారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. ఆలయంలోని మూలవిరాట్‌ను ముక్కలు ముక్కలుగా ధ్వంసం చేశారు. అనంతరం తవ్వకాలు సాగించారు. గర్భాలయం మొత్తం గుంతల మయమయింది. శుక్రవారం ఉదయం ఆలయం వద్దకు వెళ్లిన స్థానికులు విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.

18న నవోదయ

ప్రవేశ పరీక్ష

లేపాక్షి/పుట్టపర్తి: లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఈఓ కృష్ణప్ప, విద్యాలయ ప్రిన్సిపాల్‌ నాగరాజు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 10.30 గంటల్లోపు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 7,987 మంది విద్యార్థులకు 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల అడ్మిట్‌ కార్డులను www.navodaya.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడు చేసుకోవచ్చు. లేదా, జవహర్‌ నవోదయ విద్యాలయ, లేపాక్షిలోని కార్యాలయం నుంచి పొందవచ్చు. సందేహాల నివృత్తికి 95732 87480లో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
వీరభద్రుని సేవలో  కేంద్ర మంత్రి 1
1/2

వీరభద్రుని సేవలో కేంద్ర మంత్రి

వీరభద్రుని సేవలో  కేంద్ర మంత్రి 2
2/2

వీరభద్రుని సేవలో కేంద్ర మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement