పట్టుకున్న ఇసుకనూ అమ్మేశారు!
బత్తలపల్లి: ఇసుక అక్రమ తరలింపులను పోలీసులు అడ్డుకుని తహసీల్దార్‌కు అప్పగిస్తే... ఆ డంప్ మొత్తాన్ని రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్న వైనం బత్తలపల్లిలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాలు... బత్తలపల్లి మండలంలోని చిత్రావతి నుంది నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు పది టిప్పర్లకు పైగా ఇసుకను ఇటీవల పోలీసులు పట్టుకుని తహసీల్దార్‌కు స్వాధీనం చేశారు. ఈ ఇసుక మొత్తం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో డంప్ చేసి ఉంచారు. ఆ వాహనాలకు రెవెన్యూ అధికారులు జరిమానాలు విధించి పంపేశారు. అయితే ఇసుక డంప్‌పై కన్నేసిన తహసీల్దార్ కారు డ్రైవర్ దానిని బేరం పెట్టి మొత్తం రూ.60 వేలకు విక్రయించాడు. వచ్చిన మొత్తంలో రూ.30 వేలు మాత్రమే ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించి, మిగిలిన రూ.30 వేలను స్వాహా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇసుక కొనుగోలు చేసిన వ్యక్తి బుదవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము లోపు జేసీబీ సాయంతో ట్రాక్టర్లలో తరలించేశారు. అయితే పోలీసులు పట్టుకున్న ఇసుకను ఇతరులకు అమ్మాలనుకుంటే మైనింగ్, సాండ్ అధికారులు ధర నిర్ణయించిన తరువాత వేలం వేస్తున్నట్లు పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా గుట్టుచప్పుడు ఇసుకను అమ్మేసినట్లుగా తెలుసుకున్న టీడీపీ నాయకులు కొందరు గురువారం ఉదయం తహసీల్దార్ స్వర్ణలతను నిలదీశారు. దీంతో కంగుతిన్న ఆమె ఉన్నతాధికారుల పేరు చెప్పి తప్పించుకోనే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తహసీల్దార్ మాట్లాడుతూ.. ‘ఇసుకను అక్రమంగా అమ్ముకోలేదు. ఉన్నతాధికారులకు చెప్పే అమ్మాం. ఇక్కడ నిల్వ చేసిన ఇసుక 15 ట్రాక్టర్లకు సరిపోయింది. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.2 వేల చొప్పున రూ.30వేలతో విక్రయించి, ప్రభుత్వ ఖజానాలో జమా చేశాం’ అంటూ వివరణ ఇచ్చారు.
తెల్లవారకనే తరలించిన
కొనుగోలుదారులు
తహసీల్దార్ కారు డ్రైవరు కనుసన్నల్లో నడిచిన వ్యవహారం
Comments
Please login to add a commentAdd a comment