మరో ఐదు రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. రాష్ట్రంలో ఎ
అమడగూరు: బయట మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రకాన్ని బట్టి రూ.130 నుంచి రూ.180 వరకూ ఉంది. పండుగకై నా రేషన్‌షాపుల్లో కందిపప్పు ఇస్తారులే అనుకున్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అరకొరా షాపుల్లో సగం మందికి కందిపప్పును సరఫరా చేయగా, ఈ నెలలో కనీసం ఒక్కరికీ కూడా కందిపప్పు సరఫరా చేయలేదు. కేవలం బియ్యం, అరకిలో చక్కెర మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో పెద్ద పండుగ సంక్రాంతికి పేదల ఇళ్లలో కందిపప్పు ఉడికే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రభుత్వం ఇచ్చే కమీషన్ చాలదన్నట్లు పలువురు డీలర్లు చేతివాటం చూపిస్తున్నారు. బియ్యం తూకం పెట్టే సమయంలో కిలో బరువున్న సంచిని స్కేలుపై ఉంచి తూకం వేస్తున్నారు. దీంతో పది కిలోలు బియ్యం తీసుకునే వారు కేవలం 9 కేజీలు మాత్రమే తీసుకెళ్తున్నారు. అరకిలో చక్కెర ధర రూ 17 ఉండగా లబ్దిదారు నుంచి రూ.20 తీసుకుంటున్నారు. అలాగే కందిపప్పు ఇచ్చే సమయంలో కూడా కిలో పప్పు రూ.67 ఉండగా రూ.70 చొప్పున తీసుకుంటున్నారు. ఇలా ప్రతి లబ్ధిదారుడి నుంచి అదనంగా రూ.6 దోచేస్తున్నారు.
కందిపప్పుకే గతి లేకపోగా కూటమి నాయకులు, ప్రభుత్వ పెద్దలు మాత్రం సంక్రాంతి కిట్లు అంటూ ఇన్ని రోజులూ ఊదరగొట్టారు. మరో నాలుగు రోజుల్లో పండుగ ఉన్నా నేటికీ సంక్రాంతి కిట్ల పంపిణీపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఊరించి ఉసూరుమనిపించారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేయని పనులకు ప్రచారం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అరకొరగా బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం
లబ్ధిదారుల ఇంటికి చేరని కందిపప్పు
మార్కెట్‌లో కిలో కంది పప్పు
రూ.130 నుంచి రూ.180
సంక్రాంతి వేళ పచ్చడి మెతుకులే తినాలా? అంటున్న లబ్ధిదారులు
బ్లాక్‌లో కేజీ రూ.130..
ప్రతి నెలా లబ్ధిదారులందరికీ కందిపప్పుతో పాటుగా సరుకులన్నీ ఇవ్వాల్సిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో ప్రతి నెలా చౌకధాన్యపు డిపోల్లో సగం స్టోర్లకు గిడ్డంగిల నుంచి 70 శాతం కందిపప్పును సరఫరా చేస్తోంది. అయితే డీలర్లు మాత్రం లబ్ధిదారుల నుంచి వేలిముద్రను వేయించుకుని, సంబంధిత కార్డులో కందిపప్పును మంజూరు చేసి లబ్ధిదారుకు మాత్రం పప్పు ఇవ్వకుండా మిగిలిన సరుకులను ఇచ్చి పంపేస్తున్నారు. కందిపప్పు ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తే స్టాకు తక్కువమందికే వచ్చిందని మీకు వచ్చే నెలలో ఇస్తామని పంపేస్తున్నారు. వచ్చిన 70 శాతం స్టాకులో 30–35 శాతం మాత్రమే పంపిణీ చేసి మిగిలిన స్టాకును లబ్ధిదారుడికి తెలీకుండా మంజూరు చేసుకుని, వారికి పప్పు ఇవ్వకుండా బ్లాక్‌మార్కెట్‌లో కేజీ రూ.130 తో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.
సంక్రాంతి కిట్లు ఏవీ?
అధిక ధరలకు రేషన్..
Comments
Please login to add a commentAdd a comment