‘ఉపాధి’లో వెలుగు చూసిన అవినీతి
రొళ్ల: మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో అక్రమాలు వెలుగు చూశాయి. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం సాయంత్రం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావుతో పాటు డ్వామా పీడీ కె.విజయప్రసాద్ హాజరై ప్రొసిడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. 2023 ఏఫ్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు ఉపాది పథకం, పంచాయతీరాజ్‌శాఖలో పూర్తి చేసిన 577 పనులకు గాను రూ.4.51 కోట్లు ఖర్చు పెట్టారు. వెచ్చించిన నిధులకు చేపట్టిన పనులు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని వారం రోజులుగా డీఆర్పీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిద్ధం చేసిన నివేదికలను ప్రజావేదికలో చదివి వినిపించారు. ఉపాది పథకంలో రూ. 1,85,652 లక్షలు, పంచాయతీరాజ్‌శాఖలో రూ.23,527 వేలు మొత్తం రూ.2,09,179 లక్షలు దుర్వినియోగం అయినట్లు వెల్లడించారు. అనంతరం మడకశిర నియోజకవర్గంలోని వక్క, అరటి పంటలను ఉపాది పథకానికి అనుసంధానం చేయాలని రత్నగిరి పంచాయతీ పరిధిలోని రైతులు జగన్నాథ్, శ్రీనివాసులు తదితరులు డ్వామా పీడీ కె.విజయప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఏపీడీ లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రామారావు, ఎస్‌ఆర్పీ చంద్రమోహన్, ఏపీఓ ఓబుళప్ప, జేఈ మారేగౌడు, డీఆర్పీలు, టీఏలు, ఎఫ్‌ఏలు, వివిధ శాఖల అధికారులు, ఉపాది సిబ్బంది, కూలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment