అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధావరలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 10వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఖాళీల వివరాలను తెలుసుకొని అక్కడే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలని, 2024 జూలై 01వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల్లోపు ఉండాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేవారు వివాహితులై ఉండాలన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment