హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు
పరిగి: మండలంలోని బీచిగానిపల్లిలో గత గురువారం భార్యపై జరిగిన హత్యాయత్నం కేసులో భర్త కరియప్పను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలను వెల్లడించారు. నిర్మలపై భర్త కరియప్ప దాడి చేసిన సంఘటనలో నిందితుడిని హైవే 544ఈఈపై నేతులపల్లి క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచామన్నారు.
అప్పు చెల్లించనందుకు ఆరు నెలల జైలు
పెనుకొండ: అప్పు తీసుకుని సుదీర్ఘంగా చెల్లించని ఓ వ్యక్తికి పెనుకొండ న్యాయమూర్తి సయ్యద్ ముజిబ్ పసలుల్లా 6 నెలల జైలు శిక్షతో పాటు రుణం మొత్తానికి డబుల్ మొత్తం చెల్లించాలని శుక్రవారం తీర్పునిచ్చారు. కదిరికి చెందిన సూర్యనారాయణ పెనుకొండకు చెందిన మహేష్‌తో 5 సంవత్సరాల క్రితం రూ. 3.24 లక్షలు తీసుకుని బాకీ పడ్డాడు. అయితే బాకీ మొత్తం చెల్లించకపోవడంతో మహేష్ పెనుకొండ కోర్టును ఆశ్రయించారు. పూర్వాపరాలు విచారించిన న్యాయమూర్తి సూర్యనారాయణకు 6 నెలల జైలు శిక్షతో పాటు తీసుకున్న మొత్తానికి డబుల్ మొత్తం చెల్లించాలని తీర్పు నిచ్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సూర్యనారాయణను పెనుకొండ సబ్‌జైల్‌కు తరలించారు.
రాష్ట్రస్థాయిలో రాణించడం అభినందనీయం
పుట్టపర్తిటౌన్: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లా విద్యార్థులు అత్యత్తమ ప్రదర్శన కనబరచడం అభినందనీయమని డీఈఓ క్రిష్టప్ప కొనియాడారు. 2024–25 సంవత్సరం రాష్ట్రస్థాయిలో స్కూల్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 21 మంది విద్యార్థులకు శుక్రవారం బుక్కపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రశంసాపత్రాలు అందజేశారు. రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించిన గణేష్, హాకీలో తృతీయ స్థానంలో నిలిచిన ప్రశాంత్‌రెడ్డి, లోకేష్ తో పాటు స్విమ్మింగ్, జిమ్మాస్టిక్, వెవెయిట్ లిప్టింగ్, బాల్ బాడ్మింటన్‌లో రాణించిన విద్యార్థులను అభినందించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జగదీష్, పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment