వైఎస్సార్‌సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు
రాప్తాడు: మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. బాధితుల వివరాలమేరకు.. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి. వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
200 మామిడి చెట్లు దగ్ధం
ముదిగుబ్బ: మండల పరిధిలోని మద్దన్నగారిపల్లి చెందిన రైతు చిన్నగాని నరసింహయాదవ్ మామిడి తోటకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పూతకు వచ్చిన 200 మామిడి చెట్లు కాలిపోయాయి. అదే విధంగా పీవీసీ పైపులు, డ్రిప్పు పరికరాలు తదితర పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment