కరెంటు సరఫరా చేయండి సారూ..
● సబ్‌స్టేషన్ ఎదుట తమ్మడేపల్లి రైతుల ధర్నా
అమరాపురం: వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల పరిధిలోని తమ్మడేపల్లి రైతులు స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తామంతా దీర్ఘకాలిక పంటలైన వక్క, తమలపాకు తోటలతో పాటు ఉల్లి, రాగి, దానిమ్మ, వేరుశనగ తదితర పంటలు సాగుచేస్తున్నామని, విద్యుత్ కోతలతో బోర్లు పనిచేయక పంటలు ఎండుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేళాపాలా లేకుండా విద్యుత్ సరఫరాలో కోతలు పెడుతుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు సమస్య తెలిపి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని విద్యుత్ శాఖ సిబ్బంది తెలపడంతో ధర్నా విరమించారు. ధర్నాలో రైతులు సిద్దప్ప, గిరీష్, అనిల్‌కుమార్, సిద్దేశ్వర, హనుమంతరాయ, నాగరాజు, అనుమంతి, కాంతరాజు, శివప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment