మేమంతా జగనన్న బాటలోనే.. | Sakshi
Sakshi News home page

మేమంతా జగనన్న బాటలోనే..

Published Mon, May 6 2024 4:30 AM

మేమంత

పాతపట్నం: కొత్తూరు మండల కేంద్రంలోని ఎస్సీవీధికి చెందిన సుమారు 200 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టొంపల కనకయ్య, కుప్ప శంకరరావు, దుర్గాసి గణపతి, కండ్ర రమణ, వినోద్‌కుమార్‌, వడమ జవరాజు, వడమ పార్ధెసు, కొనురు సింహాచలం, కుప్ప త్రినాథరావు, టొంపల భాస్కరరావు, కంఠ నరసమ్మ, మెసురు ప్రేమ్‌కుమార్‌, టొంపల లక్ష్మినారాయణ, సుందరమ్మ, టోపింటి గౌరవమ్మ, టొంపల ఉషా, కొనురు భానమ్మ, మొజురు ప్రభావతి, గిడిత సావిత్రమ్మ, తలసంద్ర సంతోషమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు సీహెచ్‌ సూర్యనారాయణ, కొత్తూరు సర్పంచ్‌ పడాల లక్ష్మణరావు, మండల సచివాలయ కన్వీనర్‌ గండివలస ఆనందరావు, పంకజ్‌ దాస్‌, దుర్గాసీ దేవరాజు, పొగిరి గోవింద్‌, పట్నాల షణ్ముఖబాబు, సొండి రాజా, విశాఖ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

రణస్థలం: కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు కూటమి కుట్రలను తిప్పికొట్టాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రణస్థలం మండలం పైడిభీమరం పంచాయతీ వరిసాం గ్రామానికి చెందిన చిన్నిపిన్ని సూరప్పడుతో పాటు 50 టీడీపీ కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లంకలపల్లి ప్రసాద్‌, ఎంపీటీసీ మునకాల దుర్గారావు, మాజీ ఎంపీపీ గొర్లె విజయకుమార్‌, వైఎస్సార్‌సీపీ కొల్లి బోగేష్‌, డొప్ప రాము పాల్గొన్నారు.

ఎచ్చెర్ల: లావేరు మండలం గోవిందపురం, బరిణికాం గ్రామాల్లో టీడీపీ, జనసేన పార్టీల నుంచి 50 కుటుంబాల వారు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో అదపాక దాసు, కందివలస నాగేశ్వరరావు, జాడ పాపారావు, గడిదాసు సోము లు, లంక లక్ష్మణ, లంక చంద్రరావు, లంక నాగేశ్వరరావు, అదపాక లచ్చుము, ఎం.నర్సుములు, పిల్ల వెంకన్న, రెడ్డి సూర్యనారాయణ, ఇజ్జాడ రామారావు, జాడ తవుడు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నందిగాం: మండలంలోని దిమ్మిడిజోలలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ఆ పార్టీని వీడి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రేగల కూర్మారావు, కొల్లి శ్రీరాములు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్‌ సీపీ కండువాలు ధరించారు. కార్యక్రమంలో కొల్లి చలపతిరావు, కొల్లి నారాయణరావు, సవర వసంత్‌, లోకనాధం, తోపాల కాయవాడు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

కోటబొమ్మాళి: మండల తెలుగుదేశం పార్టీ సీనియర్‌ యాదవ కుల సంఘ నాయకులు ముద్ద రామదాసు, యిద్దిబోయిన నారాయణరావు, వంజరాపు మల్లేసు, ఉర్జాన లచ్చుమయ్య తదితరులు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. టెక్కలి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ సమక్షంలో పార్టీ కండువాలు ధరించారు. కార్యక్రమంలో కురుడు ఎంపీటీసీ చుక్క లోకేష్‌, పార్టీ నాయకులు చింతాడ అనిరుద్రుడు, తోట సింహాచలం, దండాసి సింహాచలం, తోట శ్రీరాములు, యిద్దిబోయిన బుచ్చెయ్య, దుర్గయ్య, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రణస్థలం: మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జి.సిగడాం మండలం కప్పరాం గ్రామానికి చెందిన యర్రబోలు అన్నారావుతో పాటు 10 టీడీపీ కుటుంబాల వారు ఎమ్మెల్యే కిరణ్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

కొత్తూరు: మండలంలోని మదనాపురం పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఉప సర్పంచ్‌ గండికోట వెంకయ్యకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి కండువా వేసి ఆహ్వానించారు. మిగిలిన కుటుంబాలకు ఎమ్మెల్యే సూచన మేరకు పార్టీ సీనియర్‌ నాయకులు కలమట రమేష్‌బాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉపసర్పంచ్‌ లచ్చయ్య, గాది సీతమ్మ, గాది నాగరాజు, పి.సింహాచలం తదితరులు ఉన్నారు.

కాశీబుగ్గ: పలాస మండలం రెంటికోట పంచాయతీ కంట్రగడ గ్రామానికి చెందిన టీడీపీ యువకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పల్లి లోకేష్‌, తామరపల్లి దొరబాబు, దేశి చక్రవర్తి, సాన అశోక్‌కుమార్‌, ముడియా విక్రమ్‌, బాలరాజు, గొట్ర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరందరికీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు చింతల సరస్వతమ్మ, తామరాపల్లి ధర్మారావు, మడియా మన్మధరావు, గోకర్ల సోమేష్‌ పాల్గొన్నారు.

జి.సిగడాం: మండలంలోని కప్పరాం, గంగనన్నదొరపాలెం, సేతుభీమవరం గ్రామాల్లో కూటమి పార్టీలకు చెందిన 250 కుటుంబాలు ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరాయి. సేతుభీమవరంలో వైఎస్సార్‌ సీపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు పేడాడ శ్రీరామమూర్తి, సర్పంచ్‌ తొత్తడి రామారావు, ఎంపీటీసీ కుదిరెళ్లు గోవిందరావు ఆధ్వర్యంలో బీజేపీ నుంచి బొల్లు రమేష్‌, గోపాలం, రమణ, అప్పారావు, శ్రీనివాసరావు, గోవిందరావు, ఆదినారాయణ, పైల రమణ, జాడ ఈశ్వరరావు, మరుపల్లి రాజారావు, పొన్నాడ శంకరరావు, వెంపడాపు పైడిరాజు, దేరసాపు పోలయ్యలతోపాటు 150 కుటుంబాలు చేరాయి. కప్పరాం గ్రామంలో మాజీ సర్పంచ్‌ యర్రబోలు అన్నారావు, పోతిరెడ్డి పెద్దిరాజు, గొలుసుపూడి దాస్‌, నాగన అన్నాజీ, పోతిరెడ్డి సీతారాం, గొలుసుపూడి శ్రీను, గోకా శంకరరావు, జాదం సూర్యనారాయణ, సింహాచలం, పోతిరెడ్డి అప్పారావుతోపాటు 40 కుటుంబాలు, గంగన్నదొరపాలెంలో ఇరుపల్లి సింహాద్రి, తొత్తడి రామారావు, కొరగాన తిరుపతి, దూసి రమేష్‌, దుర్గారావులతోపాటు మరో 30 మంది కుటుంబాలు పార్టీలో చేరారు. వీరికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ప్రత్యేకాహ్వానితుడు మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ, రణస్థలం మాజీ ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్‌, ఎన్నికల ఇన్‌చార్జి బూరాడ చిన్నారావు, నక్క ప్రసాదరావు, రాష్ట్ర కార్యదర్శి కంది నాని, జేసీఎస్‌ కన్వీనర్‌ డోల వెంకటరమణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏర్నేన ప్రకాశరావు, తిరుమరెడ్డి గౌరీశంకరరావు, త్రినాథరావు, ఆదినారాయణ పాల్గొన్నారు.

కవిటి: మండలంలోని లండారిపుట్టుగ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో కంచిలి, లండారపుట్టుగలకు చెందిన 30 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే నర్తు రామారావు, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంట్రాక్టర్‌ కర్రియ్య, జోగారావు, కేశవరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పిరియా సాయిరాజ్‌, నరేష్‌కుమార్‌ అగర్వాలా, సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, కడియాల ప్రకాష్‌, పి.నేతాజీ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

మేమంతా జగనన్న బాటలోనే..
1/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
2/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
3/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
4/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
5/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
6/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
7/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
8/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
9/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
10/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
11/12

మేమంతా జగనన్న బాటలోనే..

మేమంతా జగనన్న బాటలోనే..
12/12

మేమంతా జగనన్న బాటలోనే..

Advertisement
Advertisement