అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు

Published Thu, May 9 2024 4:20 AM

అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు

రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 642 కేంద్రాల ద్వరా సేవలు అందుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా తక్షణం పరిష్కరిస్తూ.. ఉపయుక్తమైన సలహాలు అందజేస్తూ రైతుకు సాయపడుతున్నాయి. గతంలో చాలా తక్కువ మందికి సబ్సిడీ విత్తనాలు అందేవి. ప్రస్తుతం ఆర్‌బీకేల ద్వారా రైతులకు నేరుగా అందుతున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఎవరెవరికి ఎన్ని బస్తాల విత్తనాలు కావాలో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. మూడు రోజుల్లో రైతుల ఇళ్లకే విత్తనాలు అందజేస్తున్నారు. కావాల్సిన ఎరువులను కూడా ముందుగానే ప్రతిపాదనలు తీసుకుని అందించారు. కూరగాయల రైతులు కియోస్క్‌ల ద్వారా పురుగుల మందులు, ఎరువులు బుక్‌ చేసుకుంటున్నారు. కష్టపడి సాగు చేస్తున్న పంట వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, ప్రభుత్వ అందించే ప్రయోజనాలు పొందడానికి పంటల ఈ క్రాప్‌ను ఆర్‌బీకే స్థాయిలోనే చేశారు. పరీక్షల కోసం 7 ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.

● వైఎస్సార్‌ రైతుభరోసా కింద 3.21లక్షల మంది రైతులకు గాను రూ.1919.46కోట్లు అందించారు.

● వైఎస్సార్‌ ఉచిత పంటల భీమా కింద 87,158 రైతులకు గాను రూ 85.14కోట్లు అందజేశారు.

● రూ. 424.74కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందజేశారు.

● 82,745 మెట్రిక్‌ టన్నులు ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకే) పురుగు మందులు 5592 లీటర్లు నానో యూరి యా వంటివి ఆర్‌బీకేల ద్వారా అందించారు.

● వైఎస్సార్‌ యంత్ర సేవాపథకంలో 505 ట్రాక్టర్లు, మల్టిపుల్‌క్రాప్‌ ట్రెసర్స్‌, పాడిరేపర్స్‌, రోటావెటర్స్‌ అందజేశారు.

● సీసీఆర్‌సీ కార్డులు 27,049 కార్డులు అందించారు.

● రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందించారు.

● తిత్లీ తుపాను సమయంలో నష్టపోయిన వారికి ఏకంగా ఒక్కో చెట్టుకు రూ.3000, జీడి తోటలకు హెక్టార్‌కు రూ.50 వేలు మంజూరు చేశారు

● 2017–18 రబీ సీజన్‌లో మొక్కజొన్న పండించిన రైతులు గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం క్వింటాకు రూ.200 బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించింది. 15,915మందికి రూ.11.17కోట్లు మేర లబ్ధి చేకూర్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement