ఎస్‌బీఐ రివార్డు పాయింట్ల పేరిట మోసం | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ రివార్డు పాయింట్ల పేరిట మోసం

Published Fri, May 10 2024 8:05 PM

-

కంచిలి: ఎస్‌బీఐ రివార్డు పాయింట్లు వచ్చాయంటూ లింక్స్‌ పంపి ఆన్‌లైన్‌ మోసగాళ్లు అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారు. తాజాగా కంచిలికి చెందిన పెప్సీ ఏజెంట్‌ కొత్తకోట విజయబాబు అనే వ్యాపారి ఈ తరహా మోసానికి బలయ్యారు. విజయబాబుకు ఎస్‌బీఐ రివార్డు పాయింట్స్‌ వచ్చాయని ఓ వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌ వచ్చింది. దానిని ఓపెన్‌ చేసి అవతలి వ్యక్తికి వివరాలు చెప్పారు. అంతే నిమిషాల వ్యవధిలోనే బాధితుని వ్యాపార సంస్థకు చెందిన పి.ఎ.బి.ఎల్‌. ఓ.డి. అకౌంట్‌ నుంచి డబ్బుల్ని కాజేశారు. ఇటీవలే ఆ అకౌంట్‌కు రూ.11,80,000 రుణాన్ని బ్యాంకు వారు మంజూరు చేశారు. దానిని గుర్తించిన ఆగంతకులు విజయబాబుకు చెందిన ఎస్‌బీఐ యోనో యాప్‌ను అతడి మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయించి అందులోంచి రూ.25వేలు చొప్పన నాలుగుసార్లు, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు రూ.2,76,178, మరోసారి రూ.1,10,098 విత్‌డ్రా చేశారు. ఈ మేరకు మెసేజ్‌లు రావడంతో ఏం జరుగుతుందో అర్ధంకాక బాధితుడు బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి విషయం వివరించి లావాదేవీలు జరగకుండా నిలిపివేశారు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement