శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని గుడివీధి సమీపంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయానికి అనుసంధానంగా ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానం తాలుకా భూముల శిస్తుల సొమ్ము దుర్వినియోగమైనట్లు ఆలయ ఈవో ఎం.సుకన్య గురువారం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బలివాడ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పై రెండు దేవాలయాల్లో ఏకీకృత సర్వీసు కింద అటెండరుగా పనిచేస్తున్న వి.సతీష్ దేవస్థానాలకు చెందిన భూముల శిస్తు సొమ్ము అనధికారికంగా వసూళ్లు చేసి దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఆంజనేయ దేవాలయానికి సంబంధించి రూ.2,16,800, కోటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.3,162 సొమ్ము వసూళ్లకు పాల్పడటమే కాక వాటికి సంబంఽధించిన రశీదులను రిజిస్టర్ బుక్ నుంచి మాయం చేశాడు. ఇటీవలే విధుల్లోకి చేరిన ఈవో సుకన్య ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా వారు ఫిర్యాదు చేయమని చెప్పడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment