● మా ఊరే దీపావళి
దీపావళి పండగ మాత్రమే కాదండోయ్.. మన జిల్లాలోని రెండు గ్రామాల పేర్లు కూడా. గార, టెక్కలి మండలాల పరిధిలోని ‘దీపావళి’ పేరిట గ్రామాలున్నాయి. ఊర్లకు ఈ పేరు పెట్టడం వెనుక చరిత్ర ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగ రాజు ప్రతీ రోజూ గుర్రంపై శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వరకు వెళ్తుండేవారు. ఓ రోజు మార్గమధ్యలో సొమ్మసిల్లిపోవడంతో వైష్ణవులు, గోవుల కాపరులు సపర్యలు చేసి కాపాడతారు. రాజు మేల్కొన్న తర్వాత ఊరి పేరు అడగ్గా, తమకు ఊరు పేరు లేదని వారు చెబుతారు. ఈ ఘటన దీపావళి రోజున జరగటంతో ఆ ప్రాంతానికి దీపావళి అని పేరు పెట్టినట్టు పెద్దలు చెబుతుంటారు. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలోనూ ‘దీపావళి’ గ్రామం ఉంది. టెక్కలి నుంచి బన్నువాడ గ్రామం మీదుగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ ఊరు ఉంది. పండగ పేరుతో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment