కొందరికే..!
అందరికీ కాదు
ఇదీ పరిస్థితి..
● జిల్లాలో ఏజెన్సీలు: హెచ్‌పీసీఎల్ 17,
ఐఓసీఎల్ 11, బీపీసీఎల్ 9
వంట గ్యాస్ కనెక్షన్లు
డొమెస్టిక్ సింగిల్ సర్వీసులు 2,00,268
డబుల్ సర్వీసులు 1,40,054
మొత్తం 3,40,322
దీపం పథకం
సింగిల్ సిలిండర్ లబ్ధిదారులు 2,10,780
డబుల్ సిలిండర్ లబ్ధిదారులు 30,588
మొత్తం లబ్ధిదారులు 2,41,368
ఉజ్వల పథకం లబ్ధిదారులు 93,194
సీఎస్‌ఆర్ వినియోగదారులు 17,945
అన్ని పథకాలు కలిపి
గ్యాస్ కనెక్షన్లు 6,92,825
ఉచిత పథకం వర్తించే లబ్ధిదారులు 4,96,373
పథకానికి నోచుకోని వారు 1,96,452
శ్రీకాకుళం పాతబస్టాండ్:
ఉచిత గ్యాస్ పథకం అమలులో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులతో దోబూచులాడుతోంది. రోజుకొక నిబంధనతో గందరగోళానికి గురిచేస్తోంది. వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి వారికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నమ్మించిన చంద్రబాబు, కూటమి పాలకులు ఇప్పుడు కొంతమందికే ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటీ నెరవేర్చలేదని, ఉచిత గ్యాస్‌కి దీపావళి ముహూర్తం పెట్టినా.. అది కూడా లబ్ధిదారులందరికీ వర్తింపజేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చిక్కులెన్నో..
● ఆధార్ కార్డ్, తెలుపు రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ల వివరాలు ఒకేలా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ తప్పనిసరి.
● బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి.
● వీటిలో ఏమాత్రం తేడా ఉన్నా అనర్హులు అవుతారు.
● దీనికి తోడు రోజుకొక మార్గదర్శకాలు జారీ అవుతున్నాయి.
● సీడింగ్ ప్రకారం ఆదాయం ఎక్కువ ఉందని గుర్తిస్తే ఉచిత సిలిండర్ల సంగతి పక్కన పెడితే ఏకంగా తెలుపురేషన్ కార్డు తీసేసే అవకాశం ఉంది.
ముందుగా నగదు చెల్లించాలి
సిలిండర్ కొన్నవారు ముందుగా నగదు చెల్లించిన తర్వాత కొద్ది రోజుల్లో ఆ మొత్తాన్ని లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దీని వెనుక మాయలు ఉన్నాయని, తర్వాత ఏం చేస్తారో తెలియదని, అందరికీ ఇస్తామని చెప్పి కొందరికి ఇస్తున్నట్లే.. ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ఎన్ని చిక్కులు పెడతారోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
గందరగోళంగా ఉచిత గ్యాస్ పథకం
రోజురోజుకూ మారుతున్న మార్గదర్శకాలు
జిల్లాలో గ్యాస్ వినియోగదారులు
6,92,825 మంది
తాజా ప్రకటన మేరకు అర్హులు 4,96,373 మందే
తేడా వస్తే మరింత మందికి కోత తప్పని పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment