● పోలీసు అమరవీరులకు జోహార్లు
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసులు కవాతు చేస్తూ డే అండ్ నైట్ కూడలి మీదుగా దేశ భక్తి గీతాలతో ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగి మానవహారంగా ఏర్పడి అమరవీరులకు జోహార్లతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వ్యాస రచన పోటీలు, వైద్య శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు అవతారం, ఉమామహేశ్వరరావు, పైడిపునాయుడు, ఆర్‌ఐ నర్సింగరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment